Banner
Banner

‘జీ 5’ ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ… పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ‘అలాంటి సిత్రాలు’ను డైరెక్ట్ డిజిటల్ చేసిన ‘జీ 5’ ఓటీటీ వేదిక… విజయదశమి కానుకగా వినోదాల విందు అందివ్వడానికి సిద్ధమైంది.

ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు  హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత… ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి సందేశం ఇచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నారు.

చిత్రం కథ ప్రకారం స్టేష‌న‌రీ షాప్‌లో పనిచేసే భాస్క‌ర్ (శ్రీవిష్ణు) తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ సంజ‌న (మేఘ ఆకాష్‌)తో  ప్రేమాయ‌ణం సాగిస్తుంటాడు.  అవ‌స‌రాలు అత‌న్ని ఓ దొంగలా మార్చేస్తాయి. అనూహ్య ప‌రిణామాల త‌ర్వాత  భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నీ… అత‌నికి విద్య (సునయన) అనే మ‌రో అమ్మాయితో పెళ్ల‌య్యింద‌ని, వాళ్లిద్ద‌రికీ ఓ అబ్బాయి కూడా ఉన్నాడ‌నే విష‌యం సంజ‌న‌కి తెలుస్తుంది.  మ‌రి నిజంగానే భాస్క‌ర్‌కి పెళ్ల‌యిందా? దొంగగా ప‌ట్టుబ‌డి పోలీసులకి చిక్కిన భాస్క‌ర్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగిందనేది ‘రాజ రాజ చోర’ కథ.  

హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ‘రాజ రాజ చోర’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దొంగ గా శ్రీ విష్ణు… అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ నవ్వుకునే సినిమా ‘రాజ రాజ చోర’ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ సాగర్‌, సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌; ఎడిటింగ్‌: విప్లవ్‌; నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌.

విజయదశమి తర్వాత… ఈ నెల 22న ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాను ‘జీ 5’ విడుదల చేయనుంది.

Banner
, , , , , , , ,
Similar Posts
Latest Posts from chinnatera.com
Banner