Banner
Banner

ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తోంది. కొత్త ఆలోచనలతో దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. తమదైన విజన్ తో పాటు ప్రేక్షకులకు ఏమి కావాలో చూసుకుంటున్నారు. గత కొద్ది కాలంగా రొమాన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో వచ్చే చిన్న చిత్రాలకు ఆదరణ ఉంటోంది. ఈ విషయం గమనించిన ఓ కొత్త నిర్మాత  ఇంద్రకంటి మురళీధర్‌ …లాకెట్ టైటిల్ తో ఓ సినిమా రూపొందించారు. ఆ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో సినిమా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. చిన్న క్రైమ్, రొమాన్స్ ఉందని అర్దమవుతోంది. యూత్ కు నచ్చేలా షాట్స్ ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి ..నచ్చుతుంది.

అనిల్‌ హీరోగా అఖిల్‌ విజన్‌ మూవీస్‌ పతాకంపై ఈ సినిమాని ఇంద్రకంటి మురళీధర్‌ నిర్మించారు  ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. కథ విభిన్నంగా ఉంటుంది. నవంబర్‌ 19న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఫణికుమార్‌ అద్దేపల్లి దర్శకుడు. 

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from chinnatera.com
Banner